మళ్లీ పెరిగిన పత్తి ధర
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:15 AM
: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నాయి.
క్వింటం గరిష్ఠంగా రూ. 8,254
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పత్తి ధరలు రోజురోజుకూ పైకి ఎగబాకుతున్నాయి. రెండో రోజు పత్తి ధర క్వింటానికి రూ.150పైగా పెరిగింది. మంగళవారం పత్తి ధర క్వింటం గరిష్ఠంగా రూ.8254 పలికింది. ఖరీఫ్ సీజన్‌కు సిద్ధపడుతున్న సమయంలో పత్తి ధరలు పెరగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమలకు ఉత్పత్తికి తగ్గ పత్తి మార్కెట్‌కు విక్రయానికి రాకపోవడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోని దూది ధరలు, గింజల ధరలు స్వల్పంగా పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. 657 క్వింటాల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ.5209, గరిష్ఠ ధర రూ.8254, మధ్యస్థ ధర రూ.7639 పలికింది.