Share News

కర్నూలు జీజీహెచ్‌లో ఖరీదైన వైద్యం

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:16 AM

): తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ మండలం రాలంపేటకు చెందిన గంగాధర్‌, రేణుక దంపతుల 18 నెలల కూతురు గీతాన్షికి ఉన్నట్లుండి నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఇంజెక్షన్లు వేయాలని, చికిత్సకు రూ.3 లక్షలు పైగా ఖర్చు అవుతుందని చెప్పగా.. నిరుపేదలు కర్నూలు జీజీహెచ్‌ చిన్న పిల్లల విభాగానికి నవంబరు 29వ తేదీన వచ్చారు.

కర్నూలు జీజీహెచ్‌లో ఖరీదైన వైద్యం
హెచ్‌వోడీకి స్వీటు ఇస్తున్న తల్లి

చిన్నారి ప్రాణాలను కాపాడిన వైద్యులు

కర్నూలు హాస్పిటల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ మండలం రాలంపేటకు చెందిన గంగాధర్‌, రేణుక దంపతుల 18 నెలల కూతురు గీతాన్షికి ఉన్నట్లుండి నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రులు కర్నూలులోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా ఇంజెక్షన్లు వేయాలని, చికిత్సకు రూ.3 లక్షలు పైగా ఖర్చు అవుతుందని చెప్పగా.. నిరుపేదలు కర్నూలు జీజీహెచ్‌ చిన్న పిల్లల విభాగానికి నవంబరు 29వ తేదీన వచ్చారు. పీడియాట్రిక్‌ విభాగం హెచ్‌వోడీ డా.బి.విజయానందబాబు చిన్నారిని పరీక్షించి గీరియన్‌ బారీ (జీబీ) సిండ్రోమ్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి నాలుగో యూనిట్‌లో కేసును అడ్మిషన్‌ చేయించారు. అక్కడ నాలుగో యూనిట్‌ చీఫ్‌ డా.ప్రకాష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.లక్ష్మీనారాయణ చిన్నారికి మెరుగైన వైద్యం అందించారు. ఖరీదైన నాలుగు ఈవీ ఇమ్యునోగ్లబిలిన్స్‌ ఇంజెక్షన్లు వేసి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. సోమ వారం చిన్నారిని డిశ్చార్జి చేయగా.. తల్లిదండ్రులు చిన్న పిల్లల విభాగం హెచ్‌వోడీ డా.బి.విజయానంద బాబుకు స్వీట్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటులో ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత తమకు లేదని, కర్నూలు జీజీహెచ్‌లో డాక్టర్ల రూపంలో దేవుడే తమ బిడ్డకు ప్రాణాన్ని పోశారంటూ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. హెచ్‌వోడీ మాట్లాడుతూ జీబీ సిండ్రోమ్‌ అనేది నరాలకు సంబంధించిందని, ఇది వెన్నుపాము ద్వారా ఇన్‌ఫెక్షన్‌ మొదలై మెదడుకు చేరుకుని ప్రాణాన్ని తీస్తుందని తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించినట్లు తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 01:16 AM