వెలుగులో చీకట్లు
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:04 AM
పేదలకు ఆర్థికంగా చేయూతను అందించే వెలుగు పథకంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం పది మంది సభ్యులతో పొదుపు సంఘాలుగా ఏర్పాటుచేసింది. నెలనెల పొదుపుతో పాటు, బ్యాం కు లింకేజీ రుణాలు, రూపాయి వడ్డీ రుణాలిస్తోంది. వెలుగు కార్యాలయంలో పనిచేసే కొంత మంది ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
అవినీతికి తెరలేపిన బుక్ కీపర్లు
మోసపోతున్న సామాన్యులు
విచారణ చేపట్టిన అధికారులు
దేవనకొండ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఆర్థికంగా చేయూతను అందించే వెలుగు పథకంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం పది మంది సభ్యులతో పొదుపు సంఘాలుగా ఏర్పాటుచేసింది. నెలనెల పొదుపుతో పాటు, బ్యాం కు లింకేజీ రుణాలు, రూపాయి వడ్డీ రుణాలిస్తోంది. వెలుగు కార్యాలయంలో పనిచేసే కొంత మంది ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. అవినీతికి తెర లేపారు. మండలం లో 44 గ్రామాలకు 1519 పొదుపు సంఘాలు 56 మంది బుక్ కీపర్లు ఉన్నాయి. పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా స్ర్తీనిధి, ఉన్నతి తదితర పథకాలతో జీవనోపాధి ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్స హిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బుక్‌కీపర్లు కొందరు నిధులు పక్కదాని పట్టించి సామాన్యులను అందినకాడికి
దోచు కుంటున్నారు. చాలాచోట్ల బ్యాంకు లింకేజీ రుణాల కంతులలో తేడాలు ఉండటంతో సభ్యులు అదనపు కంతులు సైతం కట్టాల్సి వస్తుంది. మండలంలోని పి.కోటకొండలో స్ర్తీనిధి కంతులను బ్యాంకులో ఆటో డెబిట్ పెట్టినా కూడా బుక్‌కీపర్ సభ్యుల నుంచి నగదు వసూలు చేసి తన ఆవసరాలకు వాడుకు న్నాడు. తీరా సభ్యులు గుర్తించాక పొరపాటు జరిగిం దంటూ కప్పిపుచ్చిన ప్రయత్నంచేశాడు. అధికారులు సైతం అవినీతిపై విచారణకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ ఏడాది స్ర్తీనిధి లక్ష్యం రూ.7 కోట్లు గాను, ఇప్పటికి రూ.80లక్షలు మాత్రామే లబ్ధిదారులకు అందాయి. స్ర్తీనిధి, ఉన్నతి నిధులు అసలైన పేదలకు అందని ద్రాక్షగానే మిగిలాయి.
నిధులు అందేలా చర్యలు తీసుకుంటాం
కోటకొండలో ఎనిమిది సంఘాల ఫిర్యాదుతో ఐదు సంఘాలను విచారించాం. మిగిలిన మూడు సంఘాలను త్వరలోనే విచారణ చేసి జిల్లా అధికారుల దృష్టికి తీసు కెళ్తాం. అవినీతి తావులేకుండా సభ్యులకు నిధులు అందేలా చర్యలు తీసుకుంటాం - మాదుల లక్ష్మమ్మ, ఏపీఎం