Share News

బదిలీల అర్హుల జాబితా దిద్దుబాటు

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:50 PM

వైద్య, ఆరోగ్యశాఖ బదిలీల అర్హుల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆ శాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

బదిలీల అర్హుల జాబితా దిద్దుబాటు
నంద్యాల జీజీహెచ్‌

నంద్యాల హాస్పిటల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖ బదిలీల అర్హుల జాబితాలో జరిగిన అవకతవకలపై ఆ శాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అర్హుల జాబితాలో పదిమంది నర్సుల పేర్లు లేకపోవడంతో ఈ విషయాన్ని ‘వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలలు’ అనే శీర్షికతో ఈ నెల 14న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించింది. 14ఏళ్ల సీనియారిటీ ఉన్న నర్సులను బదిలీల అర్హుల జాబితాలో చేర్చకపోవడంతో మిగిలిన నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కడప ఆర్డీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2011 నుంచి ఉద్యోగం చేస్తున్న 8 మంది స్టాఫ్‌నర్సులు, 2016 నుంచి పనిచేస్తున్న ఇద్దరు స్టాఫ్‌ నర్సులను బదిలీల అర్హుల జాబితాలో చేర్చి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Updated Date - Jun 18 , 2025 | 11:50 PM