మొక్కజొన్న ధర పతనం
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:15 AM
కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న ధరలు భారీగా పతనమయ్యాయి.
కన్నీరు మున్నీరవుతున్న రైతులు
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటానికి రూ.2,400 కాగా, బుధవారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా మొక్కజొన్నల ధర గరిష్ఠంగా రూ.1,749లు, మధ్యస్థ ధర రూ.1709లు, కనిష్ఠంగా రూ.1,409ధర మాత్రమే పలకడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రెండు నెలల నుంచి తాము ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నా మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు కేంద్రాల కోసం చర్యలు తీసుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికందిన పంటనైనా దక్కించుకుందామని రైతులు ఆశిస్తే కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటానికి రూ.700 వ్యత్యాసంతో ధర పతనం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.