Share News

మొక్కజొన్న రైతు కుదేలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:50 PM

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా మారాయి.

మొక్కజొన్న రైతు కుదేలు
అవుకులో మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతున్న రైతు రమణ

తడిసి మొలక వస్తున్న గింజలు

అవుకు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా మారాయి. వర్షాలతో నెల రోజుల వ్యవధిలోనే మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. మొక్కజొన్న పంటకు గిరాకీ ఉండటంతో మండల వ్యాప్తంగా 5వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు రూ. 25వేలు ఖర్చు చేశారు. ఈసారి ప్రకృతి సహక రించపోవటంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లలోపే వచ్చింది. పంటను కోసి రోడ్ల పక్కన, కళ్లాల్లో ఆరబెట్టుకున్నారు. కురుస్తున్న వర్షంతో ధాన్యం తడవ కుండ ఉండటానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. టార్పాలిన పట్టలతో ధాన్యాన్ని కప్పి పెట్టారు. వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటం రూ. 2,400 నిర్ణయించింది. తడిసిన ధాన్యాన్ని క్వింటం రూ. 1800 ప్రకారమైన కొనుగోలు చేసెందుకు వ్యాపారులు ముందుకు రావటం లేదు. కౌలు రైతుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కొనే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:50 PM