Share News

బుధవారపేటలో కార్డన సెర్చ్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:06 AM

త్రీటౌన పోలీస్‌ స్టేషన పరిధిలోని బుధవారపేటలో ఆదివారం డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు కార్డన సెర్చ్‌ నిర్వహించారు.

బుధవారపేటలో కార్డన సెర్చ్‌
ప్రజలతో మాట్లాడుతున్న డీఎస్పీ బాబు ప్రసాద్‌

కర్నూలు క్రైం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): త్రీటౌన పోలీస్‌ స్టేషన పరిధిలోని బుధవారపేటలో ఆదివారం డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు కార్డన సెర్చ్‌ నిర్వహించారు. బుధవారపేటలోని రౌడీషీటర్లు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నెంబర్‌ ప్లేట్లు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. డీఎస్పీ బాబు ప్రసాద్‌ మాట్లాడుతూ కాలనీలో ఎటువంటి అసాం ఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 01:06 AM