శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:39 PM
జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆదివారం జిల్లాలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో అవుకు, నంద్యాల తాలుకా, నందివర్గం, మిడ్తూరు, నందికొట్కూర్ రూరల్, ఆత్మ కూరు పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈతనిఖీల్లో 15వాహనాలు, 85 మద్యం బాటిళ్లు, 20లీ టర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు. అయితే నంద్యాలలో గంజాయి కూడా దొరికినట్లు సమాచారం.
మంచి ప్రవర్తనతో మెలగాలి
నేర చరిత్ర గల వ్యక్తులు, రౌడీ షీటర్లు సమాజంలో మంచి ప్రవర్తనతో మెలగాలని ్ల ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర ప్రవృత్తికి స్వస్తిపలికి సమాజంలో గౌరవించాలన్నారు.