Share News

శాంతిభద్రతల కోసమే కార్డన్‌ సెర్చ్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:59 PM

శాంతి భద్రతల కోసం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు.

శాంతిభద్రతల కోసమే కార్డన్‌ సెర్చ్‌
కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్న పోలీసులు

ఎస్పీ సునీల్‌ షెరాన్‌

21 వాహనాలు సీజ్‌

నంద్యాల టౌన్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల కోసం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల, ఆత్మకూరు సబ్‌ డివిజన్‌ల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనుమానాస్పద, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించామన్నారు. అలాంటి వారికి అక్కడే కౌన్సెలింగ్‌ ఇచ్చామని అన్నారు. సరైన పత్రాలు లేని 21 వాహనాలను సీజ్‌ చేశామని, 14 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్‌ క్రైం, రోడ్డు ప్రమాదాలు, చిన్నారులపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:59 PM