జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:46 PM
:శాంతిభద్రతలలో భాగంగా, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
56 మోటార్ సైకిళ్లు, 27 మద్యం బాటిళ్లు, 30 లీటర్ల నాటుసారా స్వాధీనం
ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా
నంద్యాల టౌన్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి):శాంతిభద్రతలలో భాగంగా, ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ సబ్ డివిజన్ల పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి 56 మోటార్ సైకిళ్లు, 27 మద్యం బ్యాటిళ్లు, 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనుమానితుల ఇళ్లను, వ్యక్తులను, రౌడీషీటర్ల, నేర చరిత్ర కల్గిన వారి ఇళ్లను పరిశీలించినట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలపాలైన గంజాయి, గుట్కా, మట్కా, అక్రమ మద్యం, నాటుసారా జూదం వంటి వాటిని ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ పౌరులుగా మెలగాలి
నేర ప్రవృత్తి కలిగిన వారు చట్ట వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడకుండా సమాజంలో ఉత్తమ పౌరులుగా మెలగాలని ఎస్పీ అదిరాజ్ సింగ్‌రాణా పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతలలో భాగంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రౌడీషీలర్లపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. అలాగే ప్రస్తుతం వారు చేస్తున్న పని, జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.