జోరుగా మాస్ కాపీయింగ్
ABN , Publish Date - Dec 04 , 2025 | 12:42 AM
ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఫీమేల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీహెచ్‌డబ్య్లూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్) పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతోంది.
ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షల్లో ఇష్టారాజ్యం
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఫీమేల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీహెచ్‌డబ్య్లూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్) పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ సాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి కర్నూలు, అనంతపురం కళాశాలలకు చెందిన విద్యార్థులు కర్నూలులోని ఫీమెల్ శిక్షణ కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. అయితే.. కొందరు ఇన్విజిలేటర్లు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల యాజాన్యాలు విద్యార్థుల డబ్బులు వసూలు చేసి డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బందికి ముట్టచెప్పినట్లు విమర్శల వస్తున్నాయి. పరీక్షకు చీఫ్ ఎగ్జామినర్‌గా డీఐవో వ్యవహరిస్తున్నారు. పరీక్షా కేంద్రం (ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఫీమేల్) ఆవరణలో మైక్రో జిరాక్స్ కాపీలు కనిపిస్తున్నాయి.
ఈ విషయమై డీఎంహెచ్‌వో డా.ఎల్.భాస్కర్‌ను వివరణ కోరగా.. మాస్ కాపీయిుంగ్ వ్యవహారం నా దృష్టికి రాలేదని, రేపటి నుంచి తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.