క్రీడల అభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:46 AM
కర్నూలులో క్రీడల అభివృద్ధికి సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం డిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ్యన్ కలిసి వినతి పత్రం అందించారు.
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్ , నవంబరు 26(ఆంధ్రజ్యోతి): కర్నూలులో క్రీడల అభివృద్ధికి సహకరిం చాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం డిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ్యన్ కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ రాయలసీమకు ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా, రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, విద్యా కేంద్రంగా ఉన్న కర్నూలు, క్రీడా నైపుణ్య సమూహంగా మారడానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు. ఖేల్ ఇండియా కింద కర్నూలు జిల్లాలకు క్రీడా సామగ్రి సంబంధిత ప్రక్రియకు రూ.45.16 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని మంత్రి కోరారు. ఇండోర్ స్పోర్ట్సు, హల్స్, సింథటిక్స్ ఆధ్లెటిక్ ట్రాక్, పుట్ బాల్ టర్ప్, స్క్వాష్, కోర్ట్ అవసరమన్నారు. ఈ సౌకర్యాలు యువత ప్రతిభను పెంపొందించమే కాకుండా, స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తాయని, యువతకు బలమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తాయన్నారు. వీటన్నింటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి పేర్కొన్నారు.