Share News

పోలీసులు, పీపీల మధ్య సమన్వయం అవసరం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:07 PM

కేసులను ఛేదించే విషయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీసుల మధ్య సమన్వయం ఉండాలని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సఽరళా దేవి అన్నారు.

పోలీసులు, పీపీల మధ్య సమన్వయం అవసరం
రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న పీపీలు, పోలీసులు

డిప్యూటీ డైరెక్టర్‌ ఆప్‌ ప్రాసిక్యూషన్‌ సరళాదేవి

నంద్యాల టౌన్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కేసులను ఛేదించే విషయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, పోలీసుల మధ్య సమన్వయం ఉండాలని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ సఽరళా దేవి అన్నారు. శనివారం స్థానిక రామకృష్ణా పీజీ కళాకళాలో కో ఆర్డినేషన్‌పై రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమెతో పాటు నంద్యాల ఏఎస్పీ మందా జావళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక వ్యక్తి నేరం చేసిన ప్పుడు అరె స్టు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోర్టులో హాజరు పరిచే సమయంలో పోలీసులు ముందుగా తీసుకోవాల్సిన విధి విధానా లను వివరించారు. దర్యాప్తు అధికారి నేరం చేసిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించాలని కేసు విషయంలో అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించాలని తెలిపారు. కేసుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి సమయంలో ఎలా వ్యవహరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డోన్‌ డీఎ స్పీ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీనివాసులు, మహే శ్వరి, ఏపీపీ మోతీలాల్‌ ఎస్‌పీపీ సీవీ శ్రీనివాసులు పీపీలు, సీఐలు సుధాకర్‌రెడ్డి, కంబగిరిరాముడు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:07 PM