ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:35 PM
స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామునాయక్ అన్నారు.
డీఆర్వో రామునాయక్
నంద్యాల నూనెపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామునాయక్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయ చాంబర్‌లో ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఫార్మ్స్ 6, 7, 8ను పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని, వారు స్థానిక ఓటరు అయి ఉండాలని, అలా లేని పక్షంలో నియోజకవర్గ అభ్యర్థులను నియమించుకోవాలన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేసేలా చూడాలని డీఆర్వోకు నివేదించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధి రవి, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ ప్రతినిధి సాయిరాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, సీపీఐ ప్రతినిధి నరసింహులు, టీడీపీ ప్రతినిధులు పాల్గొన్నారు.