Share News

వినియోగదారులు అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:19 AM

: వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ పేర్కొన్నారు.

వినియోగదారులు అవగాహన పెంచుకోవాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ పేర్కొన్నారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న గాయత్రీ జూనియర్‌ కళాశాల నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన వినియోగదారుల అవగాహన ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వినియోగదారులను చైతన్యపరిచేందుకు అవాహన కార్యక్ర ూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు కళా శాలలు, పాఠశాలల్లో, ముఖ్య కూడళ్లలో కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకో వాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తులు శివకిషోర్‌ కుమార్‌, నారాయణరెడ్డి, డీఎస్‌వో రాజా రఘువీర్‌, ఫోరం సెక్రటరీ శివమోహన్‌ రెడ్డి, వినియోగదారుల అసోసియేషన్‌ సభ్యులు, విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:19 AM