‘శుభప్రద’కు వినియోగదారుల కమిషన్ వడ్డింపు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:51 PM
వెంచర్లు వేసి వినియోగదారులకు సేవాలోపం చేసిన శుభప్రద వెంచర్ సంస్థకు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డించింది.
కర్నూలు లీగల్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వెంచర్లు వేసి వినియోగదారులకు సేవాలోపం చేసిన శుభప్రద వెంచర్ సంస్థకు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డించింది. 2020 జూన్ నెలలో స్థానిక కల్లూరులోని సర్వే.నెంబర్లు 37, 38, 49లో శుభప్రద పేరుతో ఓవెంచర్ వేశారు. ఆవెంచర్‌లో తుగ్గలి మండలం ఆర్‌ఎస్ గ్రామానికి చెందిన ఫిర్యాది దూదేకుల హుసేన్‌బీతో పాటు మరో 28 మంది రూ.4,85లక్షలు చెల్లించి ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ వెంచర్ వేయకుండే నేషనల్ హైవే ఈ వెంచర్ గుండా చెన్నయ్ సూరత్ గ్రీన్ హైవే చేయడానికి భూసేకరణ ప్రకటన ఇచ్చారు. ఈ భూసేకరణలో బాగంగా శ్రీశుభప్రద వెంచరులోని 60 ప్లాట్లు కూడా పోవడం జరిగింది. అయితే ప్లాట్లు కొనుగోలు చేసినవారికి భూమి కన్వర్షన్ జరగకపోవడంతో ప్రభుత్వం నుంచి నష్టం జరిగింది. దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు శుభప్రద వెంచర్‌పై ల్యాండ్ కన్వర్షన్ చేయకుండానే కాకుండా ప్లాట్లు వేయడమే కాక వెంచర్‌లో నుంచి హైవే వెళ్తున్న విషయాన్ని కూడా దాచి పెట్టి తమకు సేవాలోపం చేశారని జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు విచారించిన కమిషన్‌ను శుభప్రద వెంచర్‌వారు వినియోగదారులకు సేవా లోపం చేయకుండానే కాకుండా అక్రమంగా వాణిజ్యానికి పాల్పడినట్లు నిర్ధారించింది. దీంతో ఒక్కో ప్లాటు యజమానికి రూ.2లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ.5వేలను ఫిర్యాదుదారులకు 45 రోజుల లోపు చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ కరణం కిషోర్‌కుమార్, సభ్యులు ఆదేశాలు జారీ చేశారు.