Share News

ఉగాదికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:39 PM

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అప్షన్‌ -3 ఇళ్లను ఉగాది పండుగ నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ ఏ.సిరి కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఉగాదికి ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏ.సిరి

కలెక్టర్‌ ఏ. సిరి

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అసంపూర్తిగా ఉన్న అప్షన్‌ -3 ఇళ్లను ఉగాది పండుగ నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ ఏ.సిరి కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో ఆప్షన్‌ -3 కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 10,034 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందులో 4,794 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, మిగతా 5240 ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన వాటిలో దాదాపు 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించా మని, ఇప్పటి వరకు 868 ఇళ్ల నిర్మాణ లోపాల మరమ్మతులు జరిగాయని తెలిపారు. మిగతా వాటిని వారంలోపు పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి హాజరుకాని ఆప్షన్‌ -3 కాంట్రాక్టర్లు సోమవారం జరిగే సమావేశానికి తప్పక హాజరు కా వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ మా ట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాన్ని నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణశాఖ పథక సంచాలకులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:39 PM