కానిస్టేబుళ్ల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:08 AM
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంటు బోర్డు ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏపీఎస్పీ) అభ్యర్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
16 పరీక్షా కేంద్రాలు
6,947మంది అభ్యర్థుల హాజరు
కర్నూలు క్రైం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంటు బోర్డు ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏపీఎస్పీ) అభ్యర్థులకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షను కర్నూలులో 16 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, బృందావన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కళాశాల, కేవీ సుబ్బారెడ్డి కళాశాల, అథీనా పాఠశాల, మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ పాఠశాల, శంకరాస్ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో 16 పరీక్షా కేంద్రాల్లో 7,597 మంది అభ్యర్థులకు గానూ 6,947 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అడిషినల్ ఎస్పీ హుశేన్‌పీరా, డీఎస్పీలు శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు, హేమలత, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.