విధులు ముగించుకొని వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
ABN , Publish Date - May 26 , 2025 | 12:48 AM
విధులు ము గించుకొని వెళ్తూ రోడ్డు ప్రమా దంలో ఓకానిస్టేబుల్ దుర్మణం చెందాడు.
ఆళ్లగడ్డ/ చాగలమర్రి, మే 25(ఆంధ్రజ్యోతి): విధులు ము గించుకొని వెళ్తూ రోడ్డు ప్రమా దంలో ఓకానిస్టేబుల్ దుర్మణం చెందాడు. ఈఘటన ఆళ్లగడ్డ సమీపంలో చోటు చేసుకున్నట్లు ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. వివరాలు.. కోవెలకుంట్ల పో లీస్‌స్టేషన్‌లో విధులు కానిస్టేబు ల్‌గా శేఖర్(34) పనిచేస్తున్నా డు. ఆదివారం ఉదయం విఽధులు ముగించుకొని మో టార్‌సైకిల్‌పై తిరిగివెళ్తున్నాడు. ఫోన్ రావడంతో బైక్‌ను పక్కకు ఆపారు. ఇంతలో వెనుక నుంచి పాల వాహనం ఢీకొట్టింది. దీంత కానిస్టేబుల్ శేకర్ తలకు బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెం దాడు. బైక్ నడుపుతున్న అనిరుధ్‌కు రక్తగా యాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా శేఖర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
గౌరవ వందనం..
ఎస్పీ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్, సిబ్బంది మద్దూరు గ్రామానికి చేరుకొని శేఖర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి గౌరవ వందనం చేశారు. గాలిలోకి మూడురౌండ్లు కాల్పులు జరిపి ఘన నివాళి అర్పించారు. అంతిమ యాత్రగా కానిస్టేబుల్ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్య క్రియలు చేశారు. అనంతరం అంత్యక్రియల నిర్వహణకై ప్రభుత్వ సాయం కింద మంజూరైన రూ.25 వేలు డీఎస్పీ మృ తుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. శేఖర్ కుటుం బానికి పోలీస్ శాఖ తరుపున రూ.లక్ష ఆర్ధికసాయాన్ని అందించారు. ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, చాగలమర్రి ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నివాళి
రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై మృతిచెందిన కానిస్టేబుల్ శేఖర్ మృతదేహానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె శేఖర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి అందాల్సినవని తనే దగ్గరుండి ఏర్పాటుచేస్తానని భరోసా ఇచ్చారు.