Share News

కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయండి

ABN , Publish Date - May 19 , 2025 | 12:48 AM

అసంబద్ధంగా ఉన్న పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణ ఉత్తర్వులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19, 20, 21 తేదీల్లో డీఈవో కార్యాలయాలు, 23న విద్యా భవన ముట్టడిని జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది.

కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయండి
మాట్లాడుతున్న కరుణానిధి మూర్తి

ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు

కర్నూలు ఎడ్యుకేషన్‌, మే 18(ఆంధ్రజ్యోతి): అసంబద్ధంగా ఉన్న పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణ ఉత్తర్వులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19, 20, 21 తేదీల్లో డీఈవో కార్యాలయాలు, 23న విద్యా భవన ముట్టడిని జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. పీఆర్‌టీయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కరుణానిధి మూర్తి మాట్లాడుతూ బదిలీల్లో, పదోన్నతుల్లో ఉన్నఅసంబద్ధమైన విషయా లను తొలిగించిన తర్వాతనే బదిలీలు పదోన్నతుల ప్రక్రియను చేపట్టా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, యూటీ ఎఫ్‌ రవికుమార్‌, ఏఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి, జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్‌, మరియా నందం ఏపీటీఎఫ్‌-257 మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి రం గన్న, పీఆ ర్‌టీయూ ధనుంజయ, ఎనవీ కృష్ణారెడ్డి, ఆపస్‌ జిల్లా అధ్య క్షుడు నాగి రెడ్డి, వెంకటేశ్వర్లు, ఏపీటీఏ మధుసూదన రెడ్డి, హుశేన పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:49 AM