Share News

టీడీపీతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి ఫరూక్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:06 AM

రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు.

టీడీపీతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి : మంత్రి ఫరూక్‌
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి ఫరూక్‌

రూ 1.40 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రారంభం

నంద్యాల రూరల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎనఎండీ ఫరూక్‌ అన్నారు. గురువారం పట్టణంలో పద్మావతినగర్‌లో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన రెండు వరు సల సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబునాయుడితోనే సాధ్య మన్నారు. నంద్యాల పట్టణ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రూ.1.40 కోట్లతో పద్మావతినగర్‌లో రోడ్డు నిర్మించారన్నారు. గతంలో చిన్న చిన్న వర్షాలకే మురుగు నీరు రోడ్డుపైకి చేరి ప్రజ లు ఇబ్బందులు పడేవారన్నారు. సీసీ రోడ్డు నిర్మాణంతో సమస్య శాశ్వంతంగా పరిష్కారమైందన్నారు. అలాగే రూ.40 లక్షలతో డివైడర్‌, సందరీకరణ పనులు చేపడతామ న్నారు. అలాగే సంజీవనగర్‌ నుంచి ఆత్మకూర్‌ బస్టాండ్‌ వరకు త్వర లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొ న్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్‌ స్టోరేజి- 2 నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పట్టణా న్ని అన్నివిధాలు గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సినల్‌ కమిషనర్‌ శేషన్న, ఆర్డీవో చల్లా విశ్వనాథ్‌, కౌన్సిలర్లు జైనాబీ, శ్రీదేవి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన డైరెక్టర్‌ మునియార్‌ ఖలీల్‌ అహ్మద్‌, సెంట్రల్‌ ఫుడ్‌ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ నరహరి విశ్వనాథ రెడ్డి, వార్డు ఇనచార్జి మధుసాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:06 AM