నిండా మునిగాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:36 PM
ఈ ఏడాది అధిక వర్షాలు, మార్కెట్‌లో ధరల పతనం కారణంగా నిండా మునిగిపోయామని కేంద్రబృందం ఎదుట ఉల్లిరైతులు గోడు వినిపించారు. ఓ ఏడాది మంచి లాభాలు వస్తే మూడేళ్లు నష్టాల తప్పడం లేదన్నారు.
కేంద్రబృందం ఎదుట ఉల్లి రైతుల గోడు
ప్యాలకుర్తిలో ఉల్లి పంట పరిశీలన
కోడుమూరు రూరల్, నవంబరు 18, (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అధిక వర్షాలు, మార్కెట్‌లో ధరల పతనం కారణంగా నిండా మునిగిపోయామని కేంద్రబృందం ఎదుట ఉల్లిరైతులు గోడు వినిపించారు. ఓ ఏడాది మంచి లాభాలు వస్తే మూడేళ్లు నష్టాల తప్పడం లేదన్నారు. మంగళవారం ఉల్లి రైతుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు మండలంలోని ప్యాలకుర్తి గ్రామంలో రైతు మోదీన్ పొలంలో పరిశీలించారు. పంటసాగు సమస్యలపై ఆయనతో సంభాషణ ఇలా సాగింది.
డిప్యూటీ కమిషనర్ బ్రహ్మ: ఉల్లి సాగు ఎలా ఉంది?
రైతు మోదీన్: ఈ ఏడాది దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నాం. అధిక వర్షాల కారణంగా ఉల్లి నాణ్యత దెబ్బతిని దిగుబడి పడిపోయింది. దీనికితోడు మార్కెట్‌లో ధరల పతనం వలన కోత ఖర్చులు కూడా లభించడం లేదు. దీంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. ్చ
డిప్యూటీ కమిషనర్: ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా?
మోదీన్: మార్కెట్‌లో ఉల్లి ధర పతనం కావడంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 1200 మద్దతు ధరతో కొనుగోలు చేసింది. అయితే మధ్యలోనే మద్దతు ధర తొలగించి హెక్టారుకు రూ. 50 వేలు సాయం ప్రకటించింది. ప్రభుత్వసాయం ఏమూలకు సరిపోదు.