Share News

పంట నష్టం సర్వే పూర్తి చేయండి : కలెక్టర్‌

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:19 PM

వరద ప్రభావిత గ్రామాల్లో త్వరితగతిన పంట నష్టం సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

పంట నష్టం సర్వే పూర్తి చేయండి : కలెక్టర్‌
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

బండిఆత్మకూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత గ్రామాల్లో త్వరితగతిన పంట నష్టం సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో మొంథా తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరి పంటను కలెక్టర్‌ వ్యవసాయ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఎకరం జాబితాలో రాయాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు మహేశ్వరరెడ్డి, శివ, పక్కీర్‌రెడ్డి, వీఏఏ ఆయేషా ఉన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 11:19 PM