Share News

గృహ నిర్మాణాన్ని పూర్తి చేయండి: పీడీ

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:48 AM

గృహ నిర్మాణాలను లబ్ధిదా రులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి అన్నారు.

గృహ నిర్మాణాన్ని పూర్తి చేయండి: పీడీ
లబ్ధిదారులతో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ చిరంజీవి

ఓర్వకల్లు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను లబ్ధిదా రులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి అన్నారు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామ లేఅవుట్‌ కాలనీలో ఇళ్లు పూర్తి చేయని లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిం చారు. పీడీ చిరంజీవి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, రూ.75వేలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలాగే ముందుగా లబ్ధిదారులకు అడ్వాన్సుగా రూ.15వేలు, రూ.30వేలు ఇచ్చిం దన్నారు. కార్యక్రమంలో హౌ సింగ్‌ ఏఈ శ్రీనాథ్‌, వర్క్‌ ఇన్సపెక్టర్లు రాము నాయక్‌, సత్తెన్న, సుగుణమ్మ, మల్లయ్య, పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:48 AM