భూసేకరణ త్వరగా పూర్తిచేయండి
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:33 PM
నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఏపీఐఐసీ జడ్‌ఎంను ఆదేశించారు.
కలెక్టర్ ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ఇండస్ర్టియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఏపీఐఐసీ జడ్‌ఎంను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో ఏపీఐఐసీ ప్రాజెక్టులు, భూసేకరణ అంశాలపై కలెక్టర్ ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓర్వకల్లు ఇండస్ర్టియల్ హబ్‌కు నీటి సరఫరా పైపులైన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మూడు కిలోమీటర్ల ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంఎ్‌సఎఈ పార్కుల ఏర్పాటుకు సంబంధించి అడ్వాన్స్ పొజిషిన్ కొరకు గానూ ఫైల్ సర్కులేషన్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. డ్రోన్ సిటీకి సంబంధించి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి పెగ్ మార్కింగ్ చేయాలని కలెక్టర్ ఏపీఐఐసీ జడ్‌ఎంను ఆదేశించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జడ్‌ఎం మధుసూదన్‌రెడ్డి, సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.