గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - May 30 , 2025 | 12:13 AM
గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం పత్తికొండ- ఆదోని రహదారిలో గత ప్రభు త్వంలో ఏర్పాటైన కాలనీలను పరిశీలించారు.
పత్తికొండ టౌన్, మే 29 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం పత్తికొండ- ఆదోని రహదారిలో గత ప్రభు త్వంలో ఏర్పాటైన కాలనీలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు స్థలాలతో పాటు గృహ నిర్మాణానికి నిధులు ఇచ్చా రని, చాలామంది లబ్దిదారులు పూరిచేయ లేదన్నారు. జూన్ 12 లోపు పూర్తి చేస్తే ఎస్సీ, బీసీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు ఇస్తామని తెలిపారు. హౌసింగ్ డీఈ విజయకుమార్, ఎంపీడీవో కవిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ అలి పాల్గొన్నారు.