Share News

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయండి

ABN , Publish Date - Nov 04 , 2025 | 10:51 PM

: ప్రఽదానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ కింద గిరిజన గూడెంల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రఽదానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ కింద గిరిజన గూడెంల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జరిగిన సమావేశంలో పీఎం జన్మన్‌, ధర్తి ఆబా జంజాటియా గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పీఎం జన్మన్‌ కింద మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటి వరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గ్రౌండింగ్‌లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించాలని హౌసింగ్‌ పీడీని ఆదేశించారు. ధర్తి ఆబా జంజాటియా గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద గులాంఅలియాబాద్‌ తండా, రాళ్లకొత్తూరు గ్రామాలకు 116 ఇళ్లు కేటాయించబడ్డాయని వాటి నిర్మాణాన్ని పూర్తిచేయాలనన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులకు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 1779 కార్డులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటశివ ప్రసాద్‌, హౌసింగ్‌ పీడీ శ్రీహరి గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 10:51 PM