అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయండి
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:46 PM
భక్తుల వసతి కల్పనలో భాగంగా మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని దేవదాయశాఖ రాయలసీమ జోన్ ఇన్‌చార్జి డీఈఈ శ్రీనివాసులు కాంట్రాక్టర్లకు తెలిపారు.
దేవదాయ శాఖ రాయలసీమ జోన్ ఇన్‌చార్జి డీఈఈ శ్రీనివాసులు
మహానంది, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భక్తుల వసతి కల్పనలో భాగంగా మహానంది క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని దేవదాయశాఖ రాయలసీమ జోన్ ఇన్‌చార్జి డీఈఈ శ్రీనివాసులు కాంట్రాక్టర్లకు తెలిపారు. మంగళవారం మహానంది క్షేత్రంలో రూ.10.50కోట్లతో నిర్మిస్తున్న 55గదుల వసతిగృహం నిర్మాణానికి డీఈఈ మార్కింగ్ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలను పరిశీలించి నాణ్యత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఏఈవో మధు, దేవస్ధానం పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి, నీలకంఠరాజు, సుబ్బారెడ్డి, ఏఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.