జిల్లా సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:10 AM
జిల్లా సమగ్రాభివృద్ధికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ. భరత్ పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు టిడ్కో గృహాల ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్‌కో కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.
క్రికెట్ స్టేడియం నిర్మిస్తాం
లక్ష్మీపురం టిడ్కో ఎదురుగా శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ. భరత్
కల్లూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ. భరత్ పేర్కొన్నారు. మంగళవారం కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టు టిడ్కో గృహాల ఎదురుగా 6 ఎకరాల్లో గ్రీన్‌కో కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ హైవేకి దగ్గరలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం గొప్పవిషయమన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి చిహ్నంగా ఇది నిలుస్తుందన్నారు. అదేవిదంగా కోడుమూరు నియోజకవర్గంలో బాలసాయిబాబా స్కూల్ ప్రక్కన ఉన్న ఏసీఏ క్రికెట్‌గ్రౌండ్‌లో కూడా స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామ న్నారు. గ్రీన్‌కో కంపెనీ పీ-4 విధానం ద్వారా ముందుకు వచ్చి సీఎస్‌ఆర్ కింద రూ.4 కోట్లతో స్టేడియం నిర్మించడం అభినందించాల్సిన విషయమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పంప్‌డ్ హ్రైడ్రో పవర్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో మరిన్ని మంచి పరిశ్రమలు తీసుకుని వచ్చి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్‌ఎస్‌ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పత్తికొండలో ఏర్పాటు చేయనున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటమని మంత్రి టీజీ. భరత్ తెలిపారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గ్రీన్‌కో సహకారంతో లక్ష్మీపురం జగన్నాథగట్టు వద్ద స్టేడియం, క్రీడా ప్రాంగణం తలపెట్టడం గర్వకారణమన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులు అవకాశాల కోసం హైదరాబాద్, విజయవాడ. విశాఖపట్టణం ఇక వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు సంకల్పం పీ-4 మోడల్ ఒక ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుం టుందన్నారు. కూడా చైర్మన్ సోమిశెట్టి మాట్లాడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవీంద్రబాబు, గ్రీన్‌కో కంపెనీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, గ్రీన్ కో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నాయుడు, తసీల్దారు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.