Share News

జర్నలిస్టుల వ్యాఖ్యలపై ఫిర్యాదు

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:00 AM

అమరావతి రాజధానిపై, అక్కడున్న మహిళలను కించపరిచే విధంగా జగన మీడియా జర్నలి స్టులు చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో మహిళలు గళమెత్తారు.

 జర్నలిస్టుల వ్యాఖ్యలపై ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మహిళలు

కర్నూలు క్రైం, జూన 8(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిపై, అక్కడున్న మహిళలను కించపరిచే విధంగా జగన మీడియా జర్నలి స్టులు చేసిన వ్యాఖ్యలపై జిల్లాలో మహిళలు గళమెత్తారు. పలు పోలీస్‌ స్టేషనలలో ఫిర్యాదు చేశారు. టూటౌన పోలీస్‌ స్టేషన పరిధిలో తెలుగు మహిళా కమిటీ అధ్యక్షులు ముంతాజ్‌, మారుతిశర్మ, భాగ్యలక్ష్మి మహి ళలు, మరికొంత మంది మహిళలు కలిసి ఫిర్యాదు చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని దేవ తల రాజధాని అని కొనియాడితే.. జగన మీడియా జర్నలిస్టులు నీచంగా వేశ్యల రాజధాని అనడం, దీనికి అదే డిబేట్‌లో ఉన్న మరొ జర్నలిస్టు ఆయనకు వంత పలకడంపై నీచమైన చర్య అని వారు విమర్శించారు. వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని, మహి ళలు అని ఆత్మకు క్షోభకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఫ తాలుకా పోలీస్‌ స్టేషన పరిధిలో మామిదాలపాడుకు చెందిన బం డారు పద్మ అనే మహిళ కూడా మరికొందరు మహిళలతో కలిసి ఫిర్యాదు చేసింది. మహిళలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. జగన మీడి యా జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jun 09 , 2025 | 01:00 AM