నిర్భయంగా ఫిర్యాదు చేయండి
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:08 PM
అన్యాయం జరిగితే ప్రజలు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): అన్యాయం జరిగితే ప్రజలు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆళ్లగడ్డ లోని రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆళ్లగడ్డ డీఎస్‌పి ప్రమోద్, రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ వరప్రసాద్ ఎస్పీకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులను, స్టేషన్ ఆవరణం, సిబ్బంది పనితీరు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల బారినపడి ప్రజలు నష్టపోకుండా పోలీసు శాఖ ప్రజలకు అవగాహన క ల్పిస్తుందన్నారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆళ్లగడ్డ పరిధిలో జాతీయ రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిరివెళ్ల రూరల్ పోలీస్‌స్టేషన్‌ను సైతం ఎస్పీ తనిఖీ చేశారు.