Share News

నీకా..నాకా?

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:42 AM

నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌లో ఇటీవలే మూడు దుకాణాలు నిర్మించారు.

నీకా..నాకా?
రైతు బజార్‌లో నూతనంగా నిర్మించిన దుకాణాలు ఇవే..

రైతుబజారు షాపుల కేటాయింపులో మితిమీరిన రాజకీయ జోక్యం

తలలు పట్టుకుంటున్న అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌లో ఇటీవలే మూడు దుకాణాలు నిర్మించారు. ఈ రైతు బజార్‌ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ గజం స్థలం దొరికినా రూ.లక్షలు సంపాదించుకోవచ్చనే ఆలోచన వ్యాపారుల్లో ఉంది. అయితే ఈ దుకాణాలను దక్కించుకునేందుకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దుకాణాలు తమకే ఇవ్వాలని రాజకీయనాయులతో ఫోన్లు చేయిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం మార్కెటింగ్‌ శాఖ వేలం నిర్వహించి, అధికంగా పాడినవారికే అప్పగించాలి. అయితే రాజకీయ మితిమీరిన జోక్యంతే టెండర్లు నిర్వహించేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:42 AM