Share News

చైర్మన్‌ కుర్చీ కోసం పోటాపోటీ

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:02 AM

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వాల్మీకి శాంతపై అవిశ్వాస పెట్టి నెగ్గినప్పటి నుంచి చైర్మన్‌ పదివకోసం నాయకులు పోటీపడ్డారు

చైర్మన్‌ కుర్చీ కోసం పోటాపోటీ
ఆదోని మున్సిపల్‌ కార్యాలయం

ఎట్టకేలకు మైనార్టీలకే దక్కిన పదవి

ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వాల్మీకి శాంతపై అవిశ్వాస పెట్టి నెగ్గినప్పటి నుంచి చైర్మన్‌ పదివకోసం నాయకులు పోటీపడ్డారు. ముఖ్యంగా వైస్‌ చైర్మన్లు ఎం.డి. గౌస్‌, నరసింహులు మధ్యే పోటీ కనిపించింది. అయితే ఈ విషయంలో వైసీపీ శిభిరంలోనే సుధీర్ఘ చర్చ సాగింది. కౌన్సిలర్ల మెజార్టీ ప్రకారం ఎంపిక జరిగితే మహిళా కౌన్సిలర్‌ లోకేశ్వరికే అవకాశం ఇవ్వాలని పార్టీలో నిర్ణయించారు. అయితే ఇన్‌చార్జిని నియమించాలని ఆదేశాలు రావడతో గౌస్‌కు పదవి దక్కింది.

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పటి నుంచి, నెగ్గే వరకు అన్ని తానై వ్యవహరించిన వైస్‌ చైర్మన్‌ నరసింహులు చివరి వరకు తనకే చైర్మన్‌ పదవి వస్తుందన్న ధీమాతో కనిపించారు. అయితే చివరకు వైసీపీ అధినాయకత్వం గౌస్‌కే పట్టం కట్టింది.

Updated Date - Apr 30 , 2025 | 12:02 AM