Share News

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి: కమిషనర్‌

ABN , Publish Date - May 08 , 2025 | 12:16 AM

కర్నూలు నియోజకవర్గా నికి సంబంధించి ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు కోరారు.

ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి: కమిషనర్‌
రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడుతున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, మే 7(ఆంధ్రజ్యోతి): కర్నూలు నియోజకవర్గా నికి సంబంధించి ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కార్పొరేషన కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు కోరారు. బుధవారం నగర పాలక కార్యాల యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పు లు తొలగింపునకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చిందన్నారు. ఎవరైనా చిరు నామా, పోలింగ్‌ బూత మార్పు, చనిపోయిన వ్యక్తుల ఓటరు తొలగింపునకు స్థానిక బీఎల్‌ఓను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ, సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:17 AM