మహిళలపై వ్యాఖ్యలు సరికాదు
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:47 PM
మహిళలపై వ్యాఖ్యలు సరికాదు
వైసీపీ నేతలపై సోమిశెట్టి ఆగ్రహం
కర్నూలు అర్బన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు మహిళలను టార్గెట్ చేసి కించపరుస్తూ మాట్లాడటం సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అనుచితంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారనే విషయాన్ని వైసీపీ నాయకులు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన శాస్తి చేసినా ఇంకా మారలేదని అన్నారు.