వెన్నుపోటు దినానికి తరలిరండి
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:17 AM
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ డుతూ తలపెట్టిన వెన్నుపోటు దినానికి తరలి రావాలని ఎమ్మెల్యే విరుపాక్షి పిలుపునిచ్చారు.
ఆలూరు, జూన్3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైఫల్యాలను ఎండగ డుతూ తలపెట్టిన వెన్నుపోటు దినానికి తరలి రావాలని ఎమ్మెల్యే విరుపాక్షి పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా హామీలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏమైందని, సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయకుండాదగా చేసిందన్నారు. భాస్కర్, అరికెర ఉరుకుందు,శ్రీనివాసులు, వీరేష్, గిరి, మల్లయ్య, తిక్కస్వామి, రాజు పాల్గొన్నారు.