సిద్ధేశ్వరానికి తరలిరండి: బొజ్జా
ABN , Publish Date - May 22 , 2025 | 12:17 AM
రాయలసీమ రైతాంగం జీవనాడి సిద్ధేశ్వరం అలుగు సాధనకై ఈ నెల 31వ తేదీన చేపట్టిన చలో సిద్ధేశ్వరం కార్యక్రమానికి రైతులంతా తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి పిలుపునిచ్చారు.
బండిఆత్మకూరు మే21(ఆంధ్రజ్యోతి): రాయలసీమ రైతాంగం జీవనాడి సిద్ధేశ్వరం అలుగు సాధనకై ఈ నెల 31వ తేదీన చేపట్టిన చలో సిద్ధేశ్వరం కార్యక్రమానికి రైతులంతా తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని సంతజూటూరు గ్రామంలో రైతులతో ఆయన మాట్లాడుతూ గత పాలకులంతా రాయ లసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. రాయలసీమకు సాగునీరు అందించలేని పా లకులు వివిధ ప్రాజెక్టు నిర్మాణాలు బూచిగా చూపి దగా చేస్తున్నారని అన్నారు. రాయల సీమ రైతుల గొంతుక అసెంబ్లీకి వినిపించా లని, ప్రభుత్వం సిద్ధేశ్వరం నిర్మించేలా చలో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. నాగసుధాకర్, పక్కీర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.