Share News

కలెక్టర్‌కు ‘రెడ్‌క్రాస్‌’ అవార్డు

ABN , Publish Date - May 09 , 2025 | 12:24 AM

రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి విశేష సేవలందించిన కలెక్టర్‌ రాజకుమారి గణియా గవర్నర్‌ నుంచి అవార్డు పొందారు.

కలెక్టర్‌కు ‘రెడ్‌క్రాస్‌’ అవార్డు
గవర్నర్‌ నుంచి గోల్డ్‌మెడల్‌ను అందుకుంటున్నకలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి విశేష సేవలందించిన కలెక్టర్‌ రాజకుమారి గణియా గవర్నర్‌ నుంచి అవార్డు పొందారు. గురువారం అమరావతిలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవంలో గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్‌నజీర్‌, ప్రథమ మహిళ సమీరా నజీర్‌ చేతులమీదుగా కలెక్టర్‌ రాజకుమారి గవర్నర్‌ అవార్డుతో పాటు గోల్డ్‌మెడల్‌ను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సేవలందించిన ఎనిమిది మంది కలెక్టర్లకు ఈఅవార్డును గవర్నర్‌ అందజేశారు. అందులో నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి గణియా అవార్డును పొందడం విశేషం. కార్యక్రమంలో నంద్యాల రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పర్ల దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 12:24 AM