అహోబిలంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:43 AM
మండలంలోని అహోబిలం క్షేత్రాన్ని మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దర్శించుకొని లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆళ్లగడ్డ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలంలోని అహోబిలం క్షేత్రాన్ని మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి దర్శించుకొని లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను గురించి ఆలయ ప్రధాన అర్చకులు కిడాంభి వేణుగోపాలన స్వామి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ తమిళనాడు హైకోర్టు జడ్జి జస్టిస్ ఆశను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛంను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.