కర్నూలు మార్కెట్‌యార్డు మధ్యలో నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజీ ప్లాంటు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:05 AM
: కర్నూలు మార్కెట్ యార్డులో దశాబ్దం కింద రూ.4కోట్లు ఖర్చు పెట్టి కోల్డ్ స్టోరేజీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.2.50కోట్లు ఖర్చుచేసి సగం పని పూర్తిచేశారు.
నిధుల కొరతతో సగం పనులు పూర్తి
మిగతా వాటికి మోక్షమెప్పుడో?
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో దశాబ్దం కింద రూ.4కోట్లు ఖర్చు పెట్టి కోల్డ్ స్టోరేజీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. దాదాపు రూ.2.50కోట్లు ఖర్చుచేసి సగం పని పూర్తిచేశారు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కారణంగా కేంద్ర ప్ర భుత్వం ఆర్‌ఐడీఎఫ్ కింద కేటాయించిన నిధులు వెనక్కెళ్లిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి దాకా కోల్డ్ స్టోరేజీ ప్లాంటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈస్టోరేజీ ప్లాంటు మెయింటెనెన్స్ లేక శిథిలావస్థకు చేరింది. ఇప్పటి దాకా ఖర్చు చేసిన రూ.2.50కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే వందల మంది రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవ కాశం ఏర్పడుతుంది. ఎంతోమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఏదో విధంగా ఈ ప్లాంటును అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్లాంటు నిర్మాణాన్ని ఎవరికైనా అప్పజెప్పి వారికే లీజుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకు నేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బీవోటీ (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన ఆసక్తి కలిగిన కోల్డ్ స్టోరేజీ యజమానులు, సంస్థలు లీజు పద్ధతిపై ప్లాంటు నిర్మాణాన్ని పూర్తిచేసిన తర్వాత వారికే కేటాయించేలా అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు సెల్ 9701488029, 08518-257536 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.