Share News

నిర్మల చదువుకు సహకారం

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:10 AM

రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 కార్యక్రమం కింద నిర్మల అనే విద్యార్థినికి 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ హైదరాబాదు ఉచిత చదువు, వసతి భోజన సదుపాయాలతో మూడు సంవత్సరాల డిగ్రీ, ఐఏఎస్‌ కోచింగ్‌తోపాటు ఏడాది శిక్షణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

నిర్మల చదువుకు సహకారం
నిర్మలతో ఐఏఎస్‌ అకాడమి ప్రతినిధులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కర్నూలు కలెక్టరేట్‌/ ఆదోని రూరల్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ-4 కార్యక్రమం కింద నిర్మల అనే విద్యార్థినికి 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ హైదరాబాదు ఉచిత చదువు, వసతి భోజన సదుపాయాలతో మూడు సంవత్సరాల డిగ్రీ, ఐఏఎస్‌ కోచింగ్‌తోపాటు ఏడాది శిక్షణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సోమవారం జేసీ చాంబర్‌లో హైదరాబాద్‌ 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ నిర్మలను అభినందించారు. జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య మాట్లాడుతూ ‘పీ-4’ కింద దాతలు ముందుకు వచ్చి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాల న్నారు. అనంతరం విద్యార్థిని నిర్మల మాట్లాడుతూ తన ఉన్నత చదువుకు సహకరిస్తున్న ఎంపీ నాగరాజు, జేసీ 21 సెంచరీ ఐఏఎస్‌ అకాడమికి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - Jul 01 , 2025 | 12:10 AM