Share News

కాపు, బీసీ భవనాల నిర్మాణానికి సహకరిస్తా

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:15 AM

కాపు, బీసీ భవనాల నిర్మాణాలను తాను పూర్తిగా సహకరిస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగరంలోని బీ.క్యాంపులో కాపు, బీసీ భవనాల నిర్మాణానికి మంత్రి టీజీ భరత్‌ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 సంవత్సర కాలంలో ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాపు, బీసీ భవనాల నిర్మాణాలకు చర్యలు చేపట్టిందని, నిదులు కేటాయించి నిర్మాణాలను పునాది స్థాయికి తీసుకొచ్చిందన్నారు.

కాపు, బీసీ భవనాల నిర్మాణానికి సహకరిస్తా
మంత్రి టీజీ భరత్‌ని సన్మానిస్తున్న కాపు సంఘం నాయకులు

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కాపు భవన్‌ నిర్మాణానికి భూమిపూజ

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాపు, బీసీ భవనాల నిర్మాణాలను తాను పూర్తిగా సహకరిస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగరంలోని బీ.క్యాంపులో కాపు, బీసీ భవనాల నిర్మాణానికి మంత్రి టీజీ భరత్‌ పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 సంవత్సర కాలంలో ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాపు, బీసీ భవనాల నిర్మాణాలకు చర్యలు చేపట్టిందని, నిదులు కేటాయించి నిర్మాణాలను పునాది స్థాయికి తీసుకొచ్చిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పనులను అర్ధాంతరంగా ఆపేయడం, నిధులు కేటాయించకపోవడంతో కాపు, బీసీల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. 2024 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన చెట్ల పొదలు, గుంతలతో ఉందని, అప్పుడే వారికి రెండు భవనాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వాగ్దానం ఇచ్చామన్నారు. హామీ మేరకు కాపు భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు, బీసీ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు, టీజీవీ సంస్థల ద్వారా నిధులు కేటాయించి 8 నెలల్లో కాంట్రాక్టర్‌ ప్రభాకర్‌ ద్వారా నాణ్యతతో కూడిన పనులతో పార్కింగ్‌ ప్రదేశంతో సహా పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగుతోందని, సుస్థిర పాలనతో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ప్రసూన, బీసీ కార్పొరేషన్‌ ఈడీ జాకీర్‌ హుశేన్‌, కాపు, జనసేన జిల్లా అధ్యక్షుడు సురేష్‌ బాబు, నగర బలిజ సంఘం గౌరవాధ్యక్షులు పత్తి ఓబులయ్య, రామస్వామి, అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి రవికుమార్‌, ప్రధాన సలహాదారుడు సోమశేఖర్‌, ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌ కుమార్‌, నాయకులు నారాయణ రెడ్డి, రామకృష్ణ, సహదేవుడు, కుళ్లాయప్ప, ప్రకాశ్‌ బాబు, రామిరెడ్డి, బీసీ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, రాంబాబు ఉన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 01:15 AM