Share News

ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:06 AM

పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే శ్యాంబాబు కోరారు. బుధవారం టీటీడీ కళ్యాణ మండపంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

పత్తికొండ, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే శ్యాంబాబు కోరారు. బుధవారం టీటీడీ కళ్యాణ మండపంలో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రహదారులు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. మార్కెట్‌ వద్ద ఇప్పటికే నిర్మించిన రైతుబజారు, గ్రామ పంచాయతీ స్థలాల్లో దుకాణల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామన్నారు. రెండు నెలలు వ్యాపాపరులు ఆ స్థలాల్లో దుకాణలు ఏర్పాటుచేసుకొని వ్యాపారాలు చేయాలని సూచించారు. కొందరు వ్యాపారులు మాట్లాడుతూ రైతు బజార్లో దుకాణలు ఏర్పాటు చేసుకుంటే వ్యాపారాలు జరగవని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే పైలెట్‌ ప్రాజెక్టు కింద రెండు నెలలు రైతుబజార్లో వ్యాపారం చేసుకోవాలని అలా వీలుకాని పక్షంలో తిరిగి రోడ్డుపైనే చేసుకోవచ్చని సూచించారు. సీఐ జయన్న, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ప్రమోద్‌ కుమార్‌రెడ్డి, లోక్‌నాథ్‌, పంచాయతీ సెక్రటరీ నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:06 AM