పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:24 AM
: రాష్ట్రంలో పారిశ్రాభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. మంగళవారం డిల్లీలో కేంద్ర మంత్రి అశ్వీనీ శ్రీ వైష్టవ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
కేంద్ర మంత్రిని కలిసి మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రాభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. మంగళవారం డిల్లీలో కేంద్ర మంత్రి అశ్వీనీ శ్రీ వైష్టవ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల పోటీ తత్వాన్ని పెంచడానికి ఓర్వకల్లు, శ్రీ సిటి వద్ద రైల్వే సైడింగ్‌ల విషయంపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి భరత్ తెలిపారు. కర్నూలు నుంచి విజయవాడకు నేరుగా రైలు సౌకర్యం కల్పించాలని, విద్యార్థులు రోజు వారీ ప్రయాణికులు, వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించినట్లు తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి దష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.