Share News

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:00 AM

ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి మంగళవారం పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

హెలీప్యాడ్‌ను సందర్శించిన కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, మాండ్ర

నందికొట్కూరు రూరల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా, ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి మంగళవారం పరిశీలించారు. అల్లూరు గ్రామం లో గల హెలీప్యాడ్‌ను పరిశీలించాక, మల్యాల ఎత్తిపోతల పథకాన్ని కలెక్టర్‌ రాజకుమారి, జేసీ విష్ణుచరణ్‌, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల పార్లమెంట్‌ టీడీపి ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి సందర్శించారు. హంద్రీ నీవా కాలువలో జరుగుతున్న లైనింగ్‌ పనులను కూడా వారు పరిశీలించారు. ఈ నెల 17న సీఎం చంద్రబాబు నాయుడు మల్యాల ఎత్తిపోతల నుండి నీరు విడుదల చేసి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. హంద్రీ నీవా కాలువలో ఫేస్‌ 1, ఫేస్‌2 కింద 554 కిలో మీటర్ల మేర జరుగుతున్న కాలువ లైనింగ్‌, వెడల్పు పనులను పరిశీలిస్తారు.

Updated Date - Jul 16 , 2025 | 12:00 AM