రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:28 PM
రాష్ట్రాభివృద్ధికి సీఎం కృషి
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు
‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
కర్నూలు అర్బన్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పని చేస్తున్నారని ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై తప్పుడు కూతలు కూస్తే వైసీపీ నాయకులను ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. తప్పుడు కూతలు ఇకనైనా మానుకోవాలన్నారు. రూ.44 వేల కోట్ల ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాల హమీలను అమలు చేయడంతో వైసీపీ నాయకులు జీర్ణించు కోలేక పోతున్నారని, ఎలాగైనా కూటమి ప్రభుత్వంపై బురదచల్లే ప్రయ త్నం చేస్తున్నారన్నారని ఆరోపించారు. తుఫాన్ సహాయ కార్యక్రమా లపై హేళన చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అరచేయి అడ్డుపెట్టి ఆపాడని చంద్రబాబును విమర్శించడమా.. క్రికెట్ క్రీడాడా కారులను మంత్రి నారా లోకేశ్ అభినందించడంపై తప్పుడు కూతలు కూయడం ఏమిటని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాంబాబు, పేర్నినాని, అలాగే రాజకీయం తెలియని వెంకటరెడ్డి కూడా చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడుతున్నారని, విమర్శించే అర్హత వారికి లేదని అన్నారు.