Share News

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:13 AM

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌
సీఎం సహాయనిఽధి చెక్కుల పంపిణీలో మంత్రి టీజీ భరత్‌

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో 13మందికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఆపద సమయంలో కర్నూలు నియోజక వర్గ ప్రజలను ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు అందుకున్న వారు మంత్రి టీజీ భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. షేక్‌ అబ్దుల్‌ అర్మాన్‌కు రూ.19,944, మరియమ్మకు రూ.65 వేలు, షేక్‌ షేకూన్‌ రూ.61,572, మీసాల మాధవస్వామి రూ.85వేలు, నజీర్‌అహ్మద్‌కు రూ.55 వేలు, రెహానాసుల్తాన్‌కు రూ.25,574, నీలమాదవరాయుడుకు రూ.1.19,574, రాజకుమార్‌ రెడ్డికి రూ.1,14,574, షేక్‌ ఖాజీబీకు రూ.1,04,196, సుబ్బరామయ్యకు రూ. 71,922, గౌండ అబుద్దుల్‌ వహీద్‌ రూ. 43,565, ఉప్పు రామపద్మజకు రూ.3,35,520 చెక్కులను అందజేశారు.

Updated Date - Aug 25 , 2025 | 12:13 AM