Share News

ఉలి ్లరైతుకు సీఎం అండ

ABN , Publish Date - Nov 18 , 2025 | 12:57 AM

ఉల్లిరైతుల కష్టాలను గమనించిన చంద్రబాబు క్వింటం రూ.1,200 ప్రకారం కొనుగోలు చేసి, హెక్టారుకు రూ.50వేల సాయం ప్రకటించారు. అనంతరం వారి సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర బృందం నేడు జిల్లాలో పర్యటించనుంది.

ఉలి ్లరైతుకు సీఎం అండ
కోడుమూరులో ఆరబోసిన ఉల్లి (ఫైల్‌)

సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం

అనంతరం నివేదిక ఇవ్వనున్న అధికారులు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉల్లిరైతుల కష్టాలను తీర్చేందుకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లలో దాదాపు 50వేల ఎకరాల్లో సాగవుతుంది.

ప్రతి ఏడాదీ నష్టపోతున్న రైతులు

ఉల్లి సాగు చేసిన రైతులు అష్టకష్లాలు పడుతున్నారు. అటు పంట రాకపోవడమో దిగుబడి వచ్చినా ధర లేక నష్టపోతున్నారు. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఈ ఏడాడి అధిక వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో ఉల్లి దెబ్బతింది.

కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సీఎం

రైతుల కష్టాలు గమనించిన సీఎం చంద్రబాబు క్వింటం రూ.1,200ల చొప్పున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించారు. అదే విధంగా హెక్టారుకు రూ.50వేల పరిహారాన్ని అందించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉల్లి రైతుల కష్టాలను తొలగించేందుకు శాశ్వత పరిష్కారాన్ని చూడాలని ప్రధాని మోదీని కోరారు. దీంతో కేంద్రం నుంచి 5 మంది వివిద విభాగాలకు చెందిన అధికారులు ఈ నెల 18న కర్నూలు జిల్లాలోని కోడుమూరు, గోనెగండ్ల మండలాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ డా.ఏ.సిరి పేర్కొన్నారు. 18న మధ్యాహ్నం కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కోడుమూరు మండలం ప్యాలకుర్తి, గోనెగండ్ల మండలం గాజులదిన్నె, హైచ్‌.కైరవాడి, గోనెగొండ్ల మండలాల్లో పర్యటిస్తారు. అనంతరం నంద్యాల జిల్లాకు బయలుదేరి వెళతారని ఉద్యాన శాఖ జిల్లా అధికారి కృష్ణవ ర్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బృందంలో డా.బీజే బ్రహ్మ, ఉధ్యాన శాఖ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌తో పాటు కే.మనోజ్‌, అదే విబాగానికి చెందిన సెక్రటరీతో పాటు రాజీవ్‌ కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ హేమాంగ భార్గవ్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శరవన్నన్‌, కేంద్ర ఉధ్యాన శాఖ అధికారి ఉన్నారు. వీరు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని కలెక్టర్‌ వివరించారు.

Updated Date - Nov 18 , 2025 | 12:57 AM