బాధితులకు అండగా సీఎం సహాయ నిధి
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:47 AM
ఆసుపత్రుల్లో చికిత్స చేయిం చుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు
కల్లూరు/ఓర్వకల్లు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రుల్లో చికిత్స చేయిం చుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కొమరోలు, వెంకటాపురం, చెన్నంచెట్టిపల్లె, కాల్వ, పూడిచర్ల గ్రామాలకు చెందిన బాధితులకు రూ.34,88,779ల చెక్కులు పంపిణీ చేశారు. పుల్లారెడ్డి, ప్రకాషం, శివుడు, తిరుపాలు పాల్గొన్నారు. నగరంలోని శరీన్ నగర్, కిసాన్ నగర్ పార్క్‌లో అమ్మవారిని దర్శిం చుకుని, అన్నదానంలో పాల్గొన్నారు. పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, ఎస్‌కె. శ్రీనివాసరావు, శైలజాయాదవ్, నాగమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.