Share News

టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న సీఎం

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:04 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న సీఎం
చెక్కును ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు అందజేస్తున్న మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా, జేసీ నవ్య, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కుడా నిధులతో నగరంలో 100 సీసీ కెమెరాలు

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ప్రోత్సహిస్తూ ఉంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో 100 సీసీ కెమెరాల ఏర్పాటుకు సం బంధించి కుడా నిధులు రూ.29.84లక్షల చెక్కును మంత్రితో కలిసి కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు అందించారు. ఈసందర్భంగా మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ నగరంలో ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ కెమెరాలను కుడా నిధులతో ఏర్పాటు చేస్తారన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ నగరం శాంతి భద్రలతో ప్రశాం తంగా ఉండేందుకు, నేరాల నియంత్రణకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో కుడా నిదులు మంజూరు చేశామ న్నారు. కలెక్టర్‌ రంజిత్‌బాషా మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా ట్రాఫిక్‌ నియంత్ర ణకు వీలుగా నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ నగరంలో 250 కెమెరాలతో నియంత్రణకు వీలుగా పకడ్బందీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, కుడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 12:04 AM